Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

కొత్త పాలకవర్గ బాధ్యతల స్వీకారo చిట్యాలలో ఏర్పాట్లు పూర్తి

15-02-2026 409 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికార యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రత్యేక వేదిక, భద్రతా ఏర్పాట్లు, ఆహ్వానితుల కూర్చొనే ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నల్గొండ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి. సతీష్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనుండగా, అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మీడియాకు వెల్లడించారు.

కార్యక్రమాన్ని ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కొత్త పాలకవర్గం పట్టణ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Sthanikam

కొత్త పాలకవర్గ బాధ్యతల స్వీకారo చిట్యాలలో ఏర్పాట్లు పూర్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News