Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కొమ్మర ఘటనపై నిరసన… కోవత్తులతో పసిబిడ్డకు నివాళి

Updated : 08 Mar 2026 21:50 IST
As Preferred Source 1 min read
కొమ్మర ఘటనపై నిరసన… కోవత్తులతో పసిబిడ్డకు నివాళి

ఇంద్రపాలనగరం:

నాగర్‌కర్నూల్ జిల్లా కొమ్మర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న దారుణ ఘటనపై ఇంద్రపాలనగరం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమైంది. దేవుడి దర్శనం కోరిన కుటుంబంపై దాడి జరగడంతో రెండు నెలల పసిబిడ్డ మృతి చెందిన ఘటనపై స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద కోవత్తులతో బాధిత కుటుంబానికి నివాళి అర్పించారు.

ఫిబ్రవరి 18, 2026న జరిగిన ఈ ఘటనలో కుల వివక్ష కోణం ఉన్నదని పేర్కొంటూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్, రజక సంఘం అధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్, యువ నాయకులు సింగరబోయిన గణేష్, కాటేపల్లి యాదయ్య, నక్క వెంకటేశం, కొమ్మగోని రమేష్, రజక యువజన సంఘం అధ్యక్షుడు వెలిమినేటి సురేష్, వడ్లకొండ వెంకటేశం, భువనగిరి వెంకటేశం, భువనగిరి సంజీవ, కొనరాతి నరేష్, పాలమాకుల నరేష్, భువనగిరి శ్రీనివాస్, బోనగిరి శ్రీను, చంద్రశేఖర్, వెలిమినేటి నరేష్, భువనగిరి మధు, వడ్లకొండ సందీప్, వడ్లకొండ పండిత్, బోనగిరి మధు, భువనగిరి విష్ణు, బోనగిరి చందు, వడ్లకొండ చందు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొమ్మర ఘటనపై నిరసన… కోవత్తులతో పసిబిడ్డకు నివాళి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి