Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి: బీజేపీ డిమాండ్

21-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ పట్టణ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ, కొండపై అనేక సంవత్సరాలుగా కొన్ని దుకాణాలను టెండర్ విధానం లేకుండా పునరుద్ధరిస్తూ (రెన్యువల్) కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రభావం, ప్రభుత్వ అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల భక్తులు ఇబ్బందులు పడటమే కాకుండా దేవస్థానం ఆదాయానికి నష్టం జరుగుతోందన్నారు.

ఎండోమెంట్ చట్టం ప్రకారం ఒకే దుకాణాన్ని పలు మార్లు పునరుద్ధరించడం చట్ట విరుద్ధమని, ఈ విషయంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా పారదర్శక టెండర్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి షాపుల రెన్యువల్‌కు ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్, శివరాత్రి శ్రీశైలం, బోగా అజయ్, శ్రీనాథ్, విజయ్, ప్రవీణ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి: బీజేపీ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News