Sthanikam - Truth Matters
Logo

ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత

Updated : 09 Mar 2026 15:43 IST
As Preferred Source 1 min read
ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత

ఖమ్మం: జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే . కవిత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి స్పష్టత ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నిరసనకారులు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై కొందరు ఆందోళనకారులు దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయినట్లు సమాచారం. వెంటనే సహచర పోలీసులు ఆమెను చికిత్స కోసం తరలించారు.

ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భూదాన్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆందోళనకారులు తెలిపారు.

Sthanikam

ఖమ్మంలో కవిత ఆందోళన.. ఉద్రిక్తత

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి