Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:52 AM

కౌమార దశ విద్యపై పోస్టర్ పోటీ విద్యార్థుల్లో అవగాహన పెంపు

09-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాయగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌమార దశ విద్యపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం పోస్టర్ తయారీ పోటీ నిర్వహించగా వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కౌమార దశ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, బాధ్యతాయుత ప్రవర్తన, ఆరోగ్యకర జీవనశైలి వంటి అంశాలపై విద్యార్థులు సృజనాత్మక పోస్టర్లు రూపొందించారు. పోటీలో ఎం. తుర్కపల్లి జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు మొదటి స్థానం సాధించగా, అడ్డగూడూరు కేజీబీవీ విద్యార్థులు రెండో స్థానం, ఆలేరు పీఎం జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు మూడో స్థానం దక్కించుకున్నారు.

పోటీకి న్యాయనిర్ణేతలుగా కె. సత్యనారాయణ, ఎన్. శేఖర్ వ్యవహరించగా, రిసోర్స్ పర్సన్‌గా ఎన్. శేఖర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా భువనగిరి ఏరియా ఆసుపత్రి వైద్యుడు డా. వంశీకృష్ణ, ఎయిడ్స్ కార్యక్రమ కౌన్సిలర్ సమన్వయకర్త శ్రీ ముత్తయ్య హాజరయ్యారు.

కార్యక్రమాన్ని ఏఎంఓ జానీ అఫ్గాన్ సమన్వయం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కౌమార దశ ఆరోగ్యం, అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తనపై చైతన్యం పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

కౌమార దశ విద్యపై పోస్టర్ పోటీ విద్యార్థుల్లో అవగాహన పెంపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News