Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:21 AM

కామవరపుకోటలో అంగరంగ వైభవంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

30-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తూరు రహదారి బంగ్లా వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

తొలుత పాతూరు నుండి భారీ ర్యాలీగా టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆపై పార్టీ జెండాను ఎగరవేసి, కేక్ కట్ చేసి శ్రేణులు పరస్పరం స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా రేపటితో పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో, తెలుగుదేశం మద్దతుతో వైసీపీ హయాంలో గెలుపొందిన ఐదుగురు సర్పంచులు, ఒక ఎంపీటీసీతో పాటు 1982 నుంచి పార్టీలో సేవలందిస్తున్న సీనియర్లను దుశ్శాలువాలతో, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ వారికి మెమెంటోలు అందజేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఘంటా మురళి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్ అని, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. భూమి, ఆకాశం ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ విరాజిల్లుతుందని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

మండల టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ అనేక సంస్కరణలకు ఆద్యుడని, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఆయన చూపిన బాటలో సంక్షేమానికి అభివృద్ధిని జోడించి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. అలాగే వారి మార్గదర్శకత్వంలో రోషన్ కుమార్, పుట్ట మహేష్ కుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జుజ్జురి బాబ్జి, సర్పంచులు గోరింక దాసు, గూడపాటి కేశవరావు, పసుమర్తి పార్థసారధి బాబు, వేముల నాగేశ్వరరావు, గూడపాటి మధు, కరిపోతు అనూష, ఎంపీటీసీ కంఠమనేని అంజిమూర్తి, సొసైటీ చైర్మన్లు తూతా బాలాజీ కుమార్, ఘంటా మాధవరావు, బొప్పన అంజయ్య, డోలా విజయ్, పొన్నుబోయిన సురేష్, కారె సాల్మన్ రాజు, మాన్యం దుర్గారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కామవరపుకోటలో అంగరంగ వైభవంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News