Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: బీఆర్‌ఎస్

23-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడారు.

హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. పీసీ ఘోష్ కమిషన్‌ను రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేశారని విమర్శించారు. కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.

మెడిగడ్డ మరమ్మతులను కావాలనే అడ్డుకున్నారని ప్రభుత్వంపై ఆరోపిస్తూ, సీఎం, మంత్రివర్గం ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్ట్‌కు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను విస్మరించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రైతులకు పంట కొనుగోళ్లు లేవు, యూరియా కొరత, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచి సందర్శిస్తామని, అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు

Sthanikam

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: బీఆర్‌ఎస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News