Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:33 PM

కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

24-04-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-రైతుల ప్రయోజనాలపై రాజకీయాలు ఆపాలి’ – సట్టు తిరుమలేష్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం చేపట్టిన చర్యలకు హైకోర్టు స్టే విధించడంతో రాజకీయ కక్షసాధింపుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని బీఆర్‌ఎస్ నాయకుడు సట్టు తిరుమలేష్ అన్నారు.ఘోష్ కమిషన్ నివేదికపై కోర్టు జోక్యం చేసుకోవడం ద్వారా చట్ట పరిరక్షణ మరోసారి స్పష్టమైందన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం తగదని సూచించారు.భారత రాజ్యాంగం, చట్టాలు ప్రజలకు రక్షణ కవచమని,హైకోర్టు తీర్పు వాటి ప్రాముఖ్యతను మరోసారి తెలియజేసిందన్నారు. కేసీఆర్ పాలనలో ఎటువంటి తప్పు జరగలేదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీళ్లు నిల్వ ఉండటానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. భువనగిరి, ఆలేరు,తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి భూములను సస్యశ్యామలం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.“తెలంగాణ జీవాధారం కాళేశ్వరమే” అని సట్టు తిరుమలేష్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సందిల భాస్కర్ గౌడ్,గుంటి మధుసూదన్ రెడ్డి,ఎర్రగోకుల జశ్వంత్,పల్లె సంతోష్ గౌడ్,కాకల్ల ఉపేందర్,మర్ల నాగరాజు,చెరుకు కనకయ్య,పంబ కర్ణాకర్,బొంగోని ఉపలయ్య,నాగిర్తి గోపాల్ రెడ్డి,యమ్మ భాస్కర్,పాండవుల భిక్షపతి,అశోక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News