Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దేప సురేఖ భాస్కర్ రెడ్డి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 06:41 AM

కాలేశ్వరం పై హైకోర్టు తీర్పు… కాంగ్రెస్‌కు చెంపపెట్టు: చిరుమర్తి లింగయ్య

23-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గంలోని సువర్ణ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్లుగానో చేస్తున్న ఆరోపణలకు హైకోర్టు తీర్పుతో తుదిపుల్ల పడిందని స్పష్టం చేశారు.

కాలేశ్వరాన్ని ‘కూలేశ్వరం’గా అభివర్ణిస్తూ అబద్ధపు ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు హైకోర్టు గట్టి సమాధానం చెప్పిందన్నారు. “కూలింది కాలేశ్వరం కాదు… కూలింది కాంగ్రెస్ అబద్ధాల కోట” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పీసీ ఘోష్ కమిషన్ పేరుతో వచ్చిన నివేదిక అసలు పీసీసీ నివేదికేనని తాము మొదటి నుంచే చెబుతున్నామని, హైకోర్టు తీర్పు తమ వాదనలకు మద్దతుగా నిలిచిందన్నారు. తెలంగాణ సాగునీటి వ్యవస్థపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్ర చేశాయని ఆరోపించారు.

“ఇది ముమ్మాటికి తెలంగాణ రైతాంగం విజయం” అని పేర్కొంటూ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. గోదావరి నది ఉన్నంత కాలం కాలేశ్వరం ప్రాజెక్టు కొనసాగుతుందని, ఆ ప్రాజెక్టును నిర్మించిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదేనని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. “పార్టీలపై కోపం ఉంటే విచారణలు చేయండి… కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దు” అని హెచ్చరించారు.

అలాగే బీజేపీ, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా లింగయ్య విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్టులపై ఆరోపణలు చేస్తూ స్పందించిన వారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నష్టాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

చివరిగా, “చిల్లర ప్రచారాలు మానేసి… వెంటనే మరమ్మతులు పూర్తి చేసి వాటర్ లిఫ్టింగ్ ప్రారంభించాలి. యాక్టింగ్ చాలించింది… పని మొదలు పెట్టాలి” అని ప్రభుత్వానికి కఠిన సందేశం ఇచ్చారు.

“మాకు ప్రతిపక్ష హోదా కాదు… అధికార పక్ష హోదానే వస్తుంది” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Sthanikam

కాలేశ్వరం పై హైకోర్టు తీర్పు… కాంగ్రెస్‌కు చెంపపెట్టు: చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News