రామన్నపేట: ధర్మారెడ్డి కాల్వ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహార చెక్కులు అందజేసింది. రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ జగన్నాథం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
గ్రామ సర్పంచ్ శ్రీమతి ఏడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ కాల్వ విస్తరణతో సాగునీటి వసతులు మెరుగుపడి రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే విధంగా పరిహారం అందిస్తోందన్నారు.వనం సత్తయ్య, వరికుప్పల కాశీరాం, వరికుప్పల ఎల్లప్ప, గట్టు మల్లారెడ్డి, కావాలి మారయ్య తదితర రైతులు పరిహార చెక్కులు స్వీకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి