Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:15 PM

కల్తీ కల్లు వ్యాపారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఏఐవైఎఫ్

24-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న కల్తీ కల్లు అక్రమ వ్యాపారంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అనంతరం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్, పట్టణ కార్యదర్శి టీ. వీరేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి కల్లును తీసుకువచ్చి రహస్య ప్రదేశాల్లో నిల్వచేసి, అందులో రసాయనాలు కలిపి మత్తు పెంచి పట్టణంలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం సేవించడం వల్ల ముఖ్యంగా కూలీలు, పేద ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కాలేయం, కిడ్నీలకు హానికర ప్రభావాలు ఉన్నప్పటికీ సంబంధిత శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి కల్తీ కల్లు తయారీ కేంద్రాలను గుర్తించి మూసివేయాలని, అక్రమ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే ప్రజలకు కల్తీ మద్యం ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు కే. రమేష్, కార్యదర్శి జి. అంజిత్ గౌడ్, కే. లింగప్ప, సిపిఐ మండల కార్యదర్శులు ఎల్లప్ప, సత్యనారాయణ, డీహెచ్‌పీఎస్ నియోజకవర్గ కార్యదర్శి విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు పుష్పరాజ్, బుజ్జి లింగప్ప, ఇతర సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

కల్తీ కల్లు వ్యాపారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఏఐవైఎఫ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News