Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 11:06 AM

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
April 22, 2026 09:25 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

'త్రిపుల్ ఆర్' అలైన్మెంట్ మార్పుపై మాట తప్పారు

దర్గాకు పరిహారం ఇచ్చినా తొలగించకపోవడమేంటి?

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధ్వజం

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ఇప్పుడు తమపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..​ఎన్నికల ప్రచార సమయంలో త్రిపుల్ ఆర్ రోడ్డు అలైన్మెంట్ ను దివిస్ పరిశ్రమ అవతలి నుంచి మారుస్తామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో చెప్పించారని, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని కూసుకుంట్ల ప్రశ్నించారు. అలైన్మెంట్ మార్చకుండా పాత ప్రభుత్వంపై నిందలు వేయడం హాస్యాస్పదమన్నారు.

జాతీయ రహదారి వెడల్పులో భాగంగా దర్గా తొలగింపు కోసం ఇప్పటికే రూ. 1 కోటి పరిహారం చెల్లించామని, వారు ఆ డబ్బును కూడా తీసుకున్నారని ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం దర్గాను తొలగించి, ఆ స్థానంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని డిమాండ్ చేశారు.​"జనగాం లో రూ. 13 కోట్లతో ఆశ్రమం నిర్మించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, తన సొంత నియోజకవర్గంలో ఎందుకు నిర్మించలేకపోయారు? నన్ను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదు."​రైతుల సమస్యలపై నిర్లక్ష్యం​నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎప్పుడైనా గళమెత్తారా అని కూసుకుంట్ల నిలదీశారు.​రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం వంటి పథకాలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారా?​డిండి ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, ఏదుల ప్రాజెక్టు నీళ్లు మహబూబ్ నగర్ కు వెళ్తున్నా నోరు మెదపడం లేదని ఆరోపించారు.​ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతోందని, తూకంలో బస్తాకు 10 కిలోల తరుగు తీస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.​కోమటిరెడ్డి సోదరులు విమర్శలు మానుకుని, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News