Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:37 AM

జేతురం తండాలో నూతన రేషన్ షాప్ ప్రారంభం – ప్రజలకు ఊరట

11-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి: మండలంలోని జేతురం తండా గ్రామపంచాయతీలో నూతన రేషన్ షాప్‌ను సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ములకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రేషన్ బియ్యం తీసుకోవాల్సి వచ్చేదని, జేతురం తండా, సంగ్య తండా, మామిడి కుంట తండా ప్రజలు దూరం వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకెళ్లగా కొత్త రేషన్ షాప్ మంజూరు అయిందన్నారు.

ఈ షాప్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు సులభంగా రేషన్ అందుబాటులోకి వచ్చిందని, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ప్రతిభ రాజేష్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మీట్య నాయక్, లలిత దేవేందర్ నాయక్, రేషన్ డీలర్ సర్వర్ నాయక్, వార్డు సభ్యులు బద్రు నాయక్, బద్రిబాయి, భాస్కర్, సందర్ నాయక్, దాసు నాయక్, రమేష్, శంకర్, సుమన్, పవన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జేతురం తండాలో నూతన రేషన్ షాప్ ప్రారంభం – ప్రజలకు ఊరట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News