Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:18 AM

జీపీఓలకు మొబైల్ యాప్‌లు

జీపీఓలకు మొబైల్ యాప్‌లు

జీపీఓలకు మొబైల్ యాప్‌లు
24-02-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పౌరసేవల విచారణ ఇక కాగితరహితం

పౌరసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గ్రామ పాలనాధికారులు (జీపీఓ) కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై పౌరసేవల దరఖాస్తుల స్వీకరణ నుంచి విచారణ, నివేదికల సమర్పణ వరకూ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే కొనసాగనుంది.

రెవెన్యూ సిబ్బంది స్థల పరిశీలన వివరాలు, సిఫారసులు, నివేదికలు నేరుగా యాప్‌లో నమోదు చేయడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది. కాగిత వినియోగం పూర్తిగా తగ్గించి, డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత కొంతకాలంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్‌ను అమలు చేశారు. యాప్ పనితీరును రెవెన్యూ అధికారులు సమీక్షించి, సాంకేతికంగా తలెత్తిన సమస్యలను గుర్తించి సవరణలు చేపట్టారు. అన్ని అడ్డంకులు అధిగమించిన తర్వాత పూర్తి స్థాయి అప్లికేషన్‌ను నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జీపీఓలకు అందుబాటులోకి తెచ్చారు.

ఈ సందర్భంగా జీపీఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, జగన్ మోహన్ ప్రసాద్, కలెక్టరేట్ పరిపాలనాధికారి (మీసేవ) సాయి కుమార్, ఈ–జిల్లా మేనేజర్‌తో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలు పాల్గొన్నారు.

Sthanikam

జీపీఓలకు మొబైల్ యాప్‌లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News