Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:49 AM

జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు

10-03-2026 313 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు డ్యాన్సులతో సందడి చేశారు.

స్థానిక వార్డు సభ్యుడు పెండ్ర అంజయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని, ఇష్టపడి చదవడం, గురువులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

అనంతరం నూరుశాతం హాజరు నమోదుచేసిన విద్యార్థులకు పెండ్ర అంజయ్య ప్రోత్సాహక నగదు అందించారు. ప్రధానోపాధ్యాయుడు హరిలాల్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ క్రమశిక్షణ పాటిస్తున్నారని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

జీళ్ళచెరువు పాఠశాలలో విద్యార్థులకు ఘన వీడ్కోలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News