Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

జావిద్ మృతి పట్ల నివాళులు. భువనగిరిలో కాంగ్రెస్ నాయకుల సంతాపం

16-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ సభ్యుడు మహమ్మద్ జావిద్ ఆకస్మిక మృతి పట్ల భువనగిరి జిల్లా కేంద్రంలో నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద సేవాదళ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అతహర్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి పిట్టల బాలరాజ్ మాట్లాడుతూ జావిద్ పార్టీ కష్టకాలంలో కీలక పాత్ర పోషించిన నిబద్ధత గల నాయకుడని కొనియాడారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పీసీసీ స్థాయికి చేరుకున్న జావిద్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

జావిద్ మృతి పట్ల నివాళులు. భువనగిరిలో కాంగ్రెస్ నాయకుల సంతాపం

Article Image

భువనగిరి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ సభ్యుడు మహమ్మద్ జావిద్ ఆకస్మిక మృతి పట్ల భువనగిరి జిల్లా కేంద్రంలో నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద సేవాదళ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్, మైనారిటీ నాయకులు మహమ్మద్ అతహర్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి పిట్టల బాలరాజ్ మాట్లాడుతూ జావిద్ పార్టీ కష్టకాలంలో కీలక పాత్ర పోషించిన నిబద్ధత గల నాయకుడని కొనియాడారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పీసీసీ స్థాయికి చేరుకున్న జావిద్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News