Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

జనగణనలో భాగస్వామ్యం కావాలి.కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి.

26-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణలో 2027 జనాభా లెక్కల స్వీయ గణన ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి . కిషన్ రెడ్డి స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశ అభివృద్ధికి జనాభా లెక్కలు పునాది రాయిగా ఉంటాయని పేర్కొన్నారు. సమగ్ర గణాంకాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించడం ద్వారా సమాన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఖచ్చితమైన సమాచారం సేకరణ ద్వారా సుపరిపాలన మరింత బలపడుతుందని అన్నారు.

ఆధునిక డిజిటల్ సాంకేతికత వినియోగంతో 2027 జనగణన ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని మంత్రి వివరించారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం ఉంటుందని, అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహనకు ఈ జనాభా లెక్కలు దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ఖచ్చితమైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

జనగణన డైరెక్టరేట్ సంచాలకులు భారతి హోళికేరి మాట్లాడుతూ… అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వీయ గణన పూర్తి చేయవచ్చని తెలిపారు. సమర్పించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. వివరాలు నమోదు చేసిన వెంటనే ‘స్వీయ గణన ఐడీ’ లభిస్తుందని, అనంతరం ఎన్యూమరేటర్ ధృవీకరిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జనగణనలో భాగస్వామ్యం కావాలి.కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News