Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

జనాభా లెక్కల సేకరణలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకం: తాహసిల్దార్ ఆంజనేయులు

21-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్తానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం ముగింపులో తాహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలు ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్లకు పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.సర్వేను జాగ్రత్తగా నిర్వహిస్తే రాబోయే తరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.జనాభా లెక్కల సేకరణ ద్వారా భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు అవసరమైన ముఖ్య సమాచారం లభిస్తుందని,అందువల్ల ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ,తమ ఇళ్లకు వచ్చిన సర్వే సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వాలని,అలా చేసినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయని అన్నారు.ప్రతి ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన బ్లాకులు,మ్యాపులను ముందుగానే పరిశీలించి ఫీల్డ్‌లోకి వెళ్లాలని,గ్రామ స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వే నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు దూడల వెంకటేష్,తిరుపతి రెడ్డి,ఉపాధ్యాయులు దశమంత రెడ్డి,నాగేశ్వర్ రావు,లచ్చునాయక్,నరేష్,జ్యోతిర్మయి,జ్యోతి,నాగలక్ష్మి,ఏఎస్ఓ మహేష్,భవాని,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనాభా లెక్కల సేకరణలో ఎన్యుమరేటర్ల పాత్ర కీలకం: తాహసిల్దార్ ఆంజనేయులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News