Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

ఇంటింటికి సిపిఐ – ప్రజా సమస్యలపై గళమెత్తిన నాయకులు

10-04-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా పద్మశాలి కాలనీలో ప్రజా సమస్యలపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లను నిజమైన పేదలకు ఇవ్వాలని, రైతు భరోసా సకాలంలో అందించి రైతులకు పెట్టుబడి సాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, సిపిఐ ప్రతిపక్షంగా అసెంబ్లీలో సమర్థంగా పని చేస్తోందని ప్రజలు అభినందించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, గంగాపురం వెంకటయ్య, ఎర్ర బిక్షపతి, కళ్ళెం యాదగిరి, రచ్చ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటింటికి సిపిఐ – ప్రజా సమస్యలపై గళమెత్తిన నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News