Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 AM

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ నమోదు… ఎస్‌ఐ డి.నాగరాజు

08-04-2026 744 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు రామన్నపేట పోలీసులు అండగా నిలిచారు. బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఘటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎస్‌ఐ డి. నాగరాజు చొరవతో రెండు వేర్వేరు కేసుల్లో ఈ చర్యలు తీసుకున్నారు.

దుబ్బాక గ్రామానికి చెందిన మెడబోయిన పద్మ తన కుమారుడు మెడబోయిన పరుశురాములు (35) కనిపించకుండా పోయిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ నాగరాజు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సురేందర్, సిబ్బంది గ్రామానికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇక మరో ఘటనలో అర్రూరు (పెద్దబవి) గ్రామానికి చెందిన వాకిటి నర్సింహ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అక్కడికక్కడే ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందించడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. అవసరమైతే బాధితుల వద్దకే వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Sthanikam

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్ నమోదు… ఎస్‌ఐ డి.నాగరాజు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News