సంగారెడ్డి పట్టణ శివారులోని ఇర్ఫానీ దర్గా 24వ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి.ఉర్సు ముగింపు సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా,పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం నిర్వహించిన కవ్వాలి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం కవ్వాలి కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను అభినందిస్తూ వారికి కానుకలు అందజేశారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దర్గాలకు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరలివస్తారని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య సోదరభావం,ఐక్యతను మరింత పెంపొందిస్తాయని అన్నారు.ప్రజలంతా సుఖసంతోషాలతో,శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఉర్సు వేడుకల్లో సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్ కుమార్, దర్గా నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇర్ఫానీ దర్గా ఉర్సు వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

Krishna
సంగారెడ్డి పట్టణ శివారులోని ఇర్ఫానీ దర్గా 24వ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి.ఉర్సు ముగింపు సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా,పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం నిర్వహించిన కవ్వాలి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం కవ్వాలి కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను అభినందిస్తూ వారికి కానుకలు అందజేశారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దర్గాలకు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరలివస్తారని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య సోదరభావం,ఐక్యతను మరింత పెంపొందిస్తాయని అన్నారు.ప్రజలంతా సుఖసంతోషాలతో,శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఉర్సు వేడుకల్లో సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్ కుమార్, దర్గా నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి