మలక్‌పేట్, అక్టోబర్ 4: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపో సమీపంలో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 12 వాహనాలను సీజ్ చేశారు. ఇందులో ఒక కారు, ఒక ఆటో, 10 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి తమతోపాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రానున్న రోజుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి