Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘట్కాలో రామన్నపేట విద్యార్థుల జోరు. జాతీయ సెలక్షన్‌కు నవ్య, నందిని నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 04, 2026 07:30 PM

ఆకలికి అన్నం.. ఆపదలో అండగా! బసవతారకం ఆసుపత్రి వద్ద 300 మందికి అన్నదానం

04-10-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

‘రెడీ టూ సర్వ్‌’, ‘నవదీప’ ఫౌండేషన్ల సేవా కార్యక్రమం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4: వైద్యం కోసం నగరానికి వచ్చి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు ‘రెడీ టూ సర్వ్‌ ఫౌండేషన్‌’, ‘నవదీప ఫౌండేషన్‌’లు అండగా నిలిచాయి. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో–అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద ఆదివారం సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా సుమారు 300 మంది రోగులు, వారి సహాయకులు, ఇతర అవసరార్థులకు ఉచితంగా నాణ్యమైన భోజనాన్ని అందించారు.

స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొని రోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రేమతో భోజనం వడ్డించారు. సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చి నగరంలో వసతి, భోజన ఖర్చులు భరించలేని తమకు అన్నదానం ఎంతో ఆసరాగా నిలిచిందని లబ్ధిదారులు తెలిపారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సేవలను మరింత విస్తరిస్తాం

ఆకలితో ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫౌండేషన్‌ ప్రతినిధులు తెలిపారు. పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఉచిత అన్నదాన కార్యక్రమాలను విస్తరిస్తామని వెల్లడించారు.

దాతలు ముందుకు రావాలి

రెడీ టూ సర్వ్‌ ఫౌండేషన్‌ ముఖ్య నిర్వాహకులు పెద్ది శంకర్‌ మాట్లాడుతూ.. సామాజిక సేవ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని అన్నారు. మానవత్వంతో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు ముందుకు వచ్చి తమకు సహకరించాలని పిలుపునిచ్చారు. మరింత మంది దాతలు భాగస్వాములైతే ఆకలితో ఉన్న వారికి విస్తృతంగా సేవలు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ల సేవా కార్యక్రమాలను పలువురు ప్రముఖులు, స్థానికులు అభినందించారు.

Sthanikam

ఆకలికి అన్నం.. ఆపదలో అండగా! బసవతారకం ఆసుపత్రి వద్ద 300 మందికి అన్నదానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News