Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘట్కాలో రామన్నపేట విద్యార్థుల జోరు. జాతీయ సెలక్షన్‌కు నవ్య, నందిని నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 04, 2026 07:28 PM

గురువుల సేవలు వెలకట్టలేనివి.7న యాదగిరిగుట్టలో ‘ఆచార్యదేవోభవ’

04-10-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్, అక్టోబర్‌ 4: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని ట్రస్మా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్‌ అన్నారు. గురువులను గౌరవించుకోవడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నెల 7న యాదగిరిగుట్టలో ట్రస్మా ఆధ్వర్యంలో ‘ఆచార్యదేవోభవ’ సన్మాన మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

బీబీనగర్‌లోని హారిక హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన ట్రస్మా మండల జనరల్‌బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు ఈ.అచ్చయ్యగౌడ్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

బీబీనగర్‌ మండల నూతన కమిటీ

అనంతరం బీబీనగర్‌ మండల ట్రస్మా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా దేవులపల్లి బ్రహ్మం, ప్రధాన కార్యదర్శిగా చింతపట్ల నాగరాజు, కోశాధికారిగా నెల్లూరి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడిగా జోమన్‌ కె.జాన్స్‌ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను జిల్లా నాయకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా ట్రస్మా నాయకురాలు వైష్ణవి, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

గురువుల సేవలు వెలకట్టలేనివి.7న యాదగిరిగుట్టలో ‘ఆచార్యదేవోభవ’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News