Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘట్కాలో రామన్నపేట విద్యార్థుల జోరు. జాతీయ సెలక్షన్‌కు నవ్య, నందిని నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 04, 2026 07:32 PM

టీయూడబ్ల్యూజే హెచ్-143 మీడియా మిత్రుల సేవలకు గౌరవం.. బ్యాగుల పంపిణీ: జీఎంఆర్ ఫౌండేషన్

04-10-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న పాత్రికేయులను గౌరవిస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే హెచ్-143 మీడియా మిత్రులకు బ్యాగులను పంపిణీ చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గ మీడియా మిత్రుల కార్యవర్గ సమావేశం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో వారి సేవలు అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. పాత్రికేయుల సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. బ్యాగులు అందుకున్న మీడియా మిత్రులు గుఱ్ఱపు మచ్చేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు, టీయూడబ్ల్యూజే హెచ్-143 కార్యవర్గ సభ్యులు, నారాయణఖేడ్ నియోజకవర్గ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టీయూడబ్ల్యూజే హెచ్-143 మీడియా మిత్రుల సేవలకు గౌరవం.. బ్యాగుల పంపిణీ: జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న పాత్రికేయులను గౌరవిస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే హెచ్-143 మీడియా మిత్రులకు బ్యాగులను పంపిణీ చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గ మీడియా మిత్రుల కార్యవర్గ సమావేశం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో వారి సేవలు అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. పాత్రికేయుల సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. బ్యాగులు అందుకున్న మీడియా మిత్రులు గుఱ్ఱపు మచ్చేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు, టీయూడబ్ల్యూజే హెచ్-143 కార్యవర్గ సభ్యులు, నారాయణఖేడ్ నియోజకవర్గ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News