ఆందోల్ మండలం రాంసాన్‌పల్లి గ్రామంలో రాత్రివేళ గుర్తుతెలియని దుండగులు వరుస దొంగతనాలకు పాల్పడటంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది. ఒకే రాత్రి పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు కడారి మల్లారెడ్డి ఇంట్లో రూ.60 వేల నగదు, ఒక తులం బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. అలాగే మందపురం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో మూడు తులాల పుస్తెల తాడు, వెండి వస్తువులు, రూ.30 వేల నగదు చోరీ చేశారు. పాలడుగు మోహన్‌రెడ్డికి చెందిన బైక్‌ను ఎత్తుకెళ్లగా, మందపురం అంజాగౌడ్‌కు చెందిన మరో బైక్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ వరుస చోరీల్లో సుమారు రూ.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న జోగిపేట ఎస్సై గిరి శ్రీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రివేళల్లో పోలీసుల గస్తీని పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రాంసాన్‌పల్లిలో వరుస దొంగతనాలు.. రూ.5 లక్షలకుపైగా నష్టం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి