పాలడుగు నాగార్జున డిమాండ్
నల్లగొండ: నీటి కొరతతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. గ్రామానికి చెందిన సైదిరెడ్డి సాగు చేసిన వరి పంట పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు. గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.
అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులు పంటలు ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అన్నారెడ్డిగూడతో పాటు నల్లగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో సమగ్ర పంట నష్టం సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు తగిన పరిహారం అందించాలని, బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని కోరారు. రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందించి, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో కొండా అనురాధ, కొండా వెంకన్న, పోలీస్ సత్యనారాయణ, బతుల బక్కయ్య, బతుల వెంకులు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి