కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మాణం చేసిన ఇన్‌పేషెంట్ విభాగాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం కోదాడలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, నూతన భవన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. రూ.26 కోట్లతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగవంతగా జరుగుతున్నాయాన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి, ప్రస్తుతం ఆసుపత్రి రెనోవేషన్‌తో పాటు నూతనంగా నిర్మాణం చేసిన ఎగ్జిస్టింగ్ బ్లాక్, ఇన్‌పేషెంట్ విభాగం పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.నేటి నుంచి ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలు ప్రారంభమయ్యాయని, కోదాడ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులు, అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో కోదాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ, డీసీహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, డాక్టర్ సుబ్బారావు, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైద్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి