23వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళుల. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
23వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళుల. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
Editor Desk
ప్రజాసేవలో చెరగని ముద్ర.. వేమవరం ప్రసన్న–రత్నాకర్ బాబు
రామన్నపేట అక్టోబర్ 04 స్థానికం ప్రతినిధి:
రామన్నపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కీ.శే. వేమవరం ప్రసన్న–రత్నాకర్ బాబు దంపతుల 23వ వర్ధంతి సందర్భంగా జనంపల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. వారి విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. చిన్న వయసులోనే జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి జిల్లా అభివృద్ధికి వేమవరం ప్రసన్న–రత్నాకర్ బాబు విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సేవలందిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు.
ఆయన జీవించి ఉంటే రాజకీయాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి పలు కీలక పదవులు చేపట్టేవారని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జనంపల్లి గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారని తెలిపారు. అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టడం సవాలుతో కూడుకున్నప్పటికీ జిల్లా నాయకుల మన్ననలు పొందుతూ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారని గుర్తుచేశారు.
వేమవరం ప్రసన్న–రత్నాకర్ బాబు మరణానంతరం వారి సేవా వారసత్వాన్ని కొనసాగిస్తూ జిల్లా పరిషత్ సభ్యుడిగా వేమవరపు మనోహర పంతులు, మండల ప్రాదేశిక సభ్యుడిగా సుధీర్‌బాబు ప్రజాసేవ అందించారని లింగయ్య పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే ఇలాంటి నాయకులను ఆదరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, గర్దాస్ విక్రమ్, మాజీ మండల అధ్యక్షులు, పోచబోయిన మల్లేశం, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, అంబటి రవీందర్ రెడ్డి,పులిపలుల వీరస్వామి,ఈడం రాధా శ్రీనివాస్, బొక్క మాధవరెడ్డి,బందెల రాములు, కన్నెబోయిన బలరాం, ఎడ్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి,మిరియాల మల్లేశం, పిట్ట కృష్ణారెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, భూసాని రాజు, తదితరులు పాల్గొన్నారు.