ఆర్టీఐ చట్టం వారోత్సవాలు అధికారికంగా నిర్వహించాల
యాదాద్రి భువనగిరి: ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు అవినీతి రహిత సమాజ నిర్మాణానికి సమాచార హక్కు చట్టం–2005లోని సెక్షన్ 4(1)(బి) నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్యాంపెయిన్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రజా ప్రాధికార సంస్థలు కూడా చట్టబద్ధమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం కార్యాలయాల విధులు, అధికారుల బాధ్యతలు, నిర్ణయాలు తీసుకునే విధానం, నిబంధనలు, రికార్డులు, ఉద్యోగుల వివరాలు, వేతనాలు, బడ్జెట్, ప్రభుత్వ వ్యయాలు, సబ్సిడీలు, లబ్ధిదారులు, రాయితీలు, అనుమతులు తదితర 17 రకాల సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచాలని తెలిపారు.
పీఐఓ వివరాలు బోర్డులపై పెట్టాలి
ప్రజలకు సమాచారం అందించే ప్రజా సమాచార అధికారులు (పీఐఓ), సహాయ సమాచార అధికారులు (ఏపీఐఓ), మొదటి అప్పీల్ అధికారులు (ఎఫ్‌ఏఏ) పేర్లు, హోదాలు, సంప్రదింపు వివరాలను కార్యాలయాల నోటీసు బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాలని కోరారు. అధికారుల బదిలీలు, బాధ్యతల మార్పులు జరిగిన వెంటనే వివరాలను సవరించాలని సూచించారు.
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రజలకు ముందుగానే అందుబాటులో ఉంచితే పారదర్శకతతోపాటు అధికారుల జవాబుదారీతనం పెరుగుతుందని వెంకటేష్ పేర్కొన్నారు. ప్రజలకు అందాల్సిన సమాచారాన్ని దాచకుండా చట్టం నిర్దేశించిన మేరకు బహిరంగంగా ప్రదర్శించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి