రామన్నపేట: గాంధీ జయంతిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి.స్మాట్) ఆధ్వర్యంలో ఉత్తమ ప్రైవేట్ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఉపాధ్యాయులను సత్కరించారు.
రామన్నపేట పట్టణంలోని డాన్ బోస్కో హైస్కూల్‌కు చెందిన ప్రిన్సిపాల్ దీపాలీల, ఉపాధ్యాయులు సయ్యద్ ఖదీర్, పిట్టల మత్స్యగిరి, బల్గురి సునీత, హీనా తబస్సుమ్‌లకు విద్యారంగంలో అందిస్తున్న సేవలను గుర్తించి ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు’ అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యారంగంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో బి.స్మాట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడాల జలేందర్‌రెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కొండూరు మల్లేశం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పీజీవీ చిట్టిబాబు, జిల్లా కోశాధికారి సింగిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డాన్ బోస్కో హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్ పి. జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి