Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడలో హీరోయిన్ రితికా నాయక్ సందడి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 04, 2026 12:17 AM

కోదాడలో చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

03-10-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడలో నూతనంగా ఏర్పాటు చేసిన 37వ బ్రాంచ్ చెన్నై షాపింగ్ మాల్‌ను శనివారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తూ అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రజలు షాపింగ్ మాల్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సేల్స్ కౌంటర్‌ను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించగా, తొలి కొనుగోలును కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి చేశారు.ప్రారంభోత్సవం సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని ఆశీర్వదించారు. అనంతరం చెన్నై షాపింగ్ మాల్ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి , మున్సిపల్ కమిషనర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడలో చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News