పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్ కేంద్రాల్లో అక్టోబర్ 10, 2026 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌తో పాటు అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ, శారీరక దారుఢ్య పరీక్షలకు సిద్ధమయ్యేలా ఫిజికల్ ట్రైనింగ్ అందించనున్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 3 నుంచి 7, 2026 వరకు తమకు సమీపంలోని పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. పోలీసు ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ ఉద్యోగ సాధనకు కృషి చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ కోరారు.
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. అక్టోబర్ 10 నుంచి తరగతులు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి