* తులం బంగారం, రూ.11 వేల నగదు అపహరణ.
చిట్యాల: మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో శనివారం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన పోగుల కమలమ్మ ఏపూరు వెళ్లే రోడ్డు పక్కన ఉన్న ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. శనివారం వ్యక్తిగత పనిమీద ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది.
పని ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకున్న ఆమెకు తాళం తీసి ఉండటాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో భద్రపరిచిన తులం బంగారు ఆభరణాలతో పాటు రూ.11 వేల నగదు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి