*పంటలు
తుంగతుర్తి;
రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గొట్టిపర్తి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బర్ల సోమన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు వ్యవసాయం చేయాలంటే ఆందోళన చెందుతున్నారని అన్నారు.పంటల సాగుకు అవసరమైన యూరియా, విద్యుత్, సాగునీటి విషయంలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నందున విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ప్రభుత్వం, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు నెంబర్ నాగేష్, బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి యాకయ్య, చింతకుంట్ల సురేష్, శ్రీనివాస్, ఏకయ్య, కృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి