Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. అక్టోబర్ 10 నుంచి తరగతులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 08:45 PM

నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర్

03-10-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచనల మేరకు ఆందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ఆందోల్–జోగిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఆందోల్ మండల అధ్యక్షుడిగా గంగాధర్ అశోక్, మునిపల్లి మండల అధ్యక్షుడిగా లింగన్న సతీష్ కుమార్, చౌటకూరు మండల అధ్యక్షుడిగా బోడపట్ల గణేష్, పుల్కల్ మండల అధ్యక్షుడిగా మల్లన్న దుర్గారెడ్డి, రాయకోడు మండల అధ్యక్షుడిగా పట్లోళ్ల కేదారినాథ్, వట్పల్లి మండల అధ్యక్షుడిగా వజినాల విశ్వాస్, ఆందోల్–జోగిపేట టౌన్ అధ్యక్షుడిగా డి.జి. వెంకటేశం, రేగోడు మండల అధ్యక్షుడిగా ఎస్. దిగంబర రావు, అల్లాదుర్గ్ మండల అధ్యక్షుడిగా కొప్పుల శేషారెడ్డి, టేక్మాల్ మండల అధ్యక్షుడిగా పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డిని నియమించారు.నూతనంగా నియమితులైన మండల, టౌన్ అధ్యక్షులు సంగారెడ్డిలోని మంత్రి దామోదర్ రాజనర్సింహ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి నియామక పత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం ఆందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం వంటి అంశాలపై చర్చించారు. నూతన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

Sthanikam

నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News