మునగాల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను తహసిల్దార్ సరిత శనివారం సందర్శించారు.విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యతను తనిఖీ చేశారు. భోజన తయారీ, వంటశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న వసతులపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడారు..ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపర్చాలని, వాటిపై తప్పనిసరిగా మూతలు భిగించాలనీ, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రతిరోజూ భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాలు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని,కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు.భోజనం వండిన తరువాత కూడా విద్యార్థులకు వడ్డించడానికి ముందు రుచి చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరగకుండా చూడాలని తెలిపారు.విద్యార్థులకు అందుతున్న వసతులపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి