Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇర్ఫానీ దర్గా ఉర్సు వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 04, 2026 06:27 PM

దళిత మహిళపై దాడిని ఖండిస్తున్నాం

దళిత మహిళపై దాడిని ఖండిస్తున్నాం

దళిత మహిళపై దాడిని ఖండిస్తున్నాం
04-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి: తల్లమల్ల హసేన్. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీ.కే. మల్లెపల్లి గ్రామంలో గ్రామ సభ సందర్భంగా దళిత మహిళ, వీఓఏ గనిపల్లి మాధవిపై జరిగిన దాడిని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది తల్లమల్ల హసేన్ తీవ్రంగా ఖండించారు. గ్రామ సభలో మాధవిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడటం ఆందోళనకరమన్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయని తెలిపారు. బాధితురాలిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు వర్తించే ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు తక్షణ రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కుల వివక్ష, దాడులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు, మహిళా సంఘాలు, విద్యార్థులు, మేధావులు గొంతెత్తాలని పిలుపునిచ్చారు. దళితులు, గిరిజనుల ఆత్మగౌరవం, రక్షణ కోసం మాల మహానాడు నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

Sthanikam

దళిత మహిళపై దాడిని ఖండిస్తున్నాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News