వెలిమినేడు కాంగ్రెస్ కార్యదర్శి గోలి నరేష్ డిమాండ్.
చిట్యాల: రాబోయే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెలిమినేడు గ్రామానికి చెందిన ప్రముఖ బీసీ సామాజిక వర్గ నాయకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. లింగం యాదవ్‌కు అవకాశం కల్పించాలని వెలిమినేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ కోరారు. విద్యావేత్తగా, యువజన నాయకుడిగా, సామాజిక ఉద్యమాల్లో చురుకైన కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న డా. లింగం యాదవ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం సముచితమన్నారు.
డా. లింగం యాదవ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పూర్తి చేశారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. రోహిత్ వేముల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు, రాహుల్ గాంధీని రెండుసార్లు తీసుకువచ్చి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలకంగా పనిచేశారని తెలిపారు.
అలాగే జేఎన్‌యూ ఢిల్లీ ఇన్‌చార్జిగా, ఎన్‌ఎస్‌యూఐ నేషనల్ కోఆర్డినేటర్‌గా సేవలందిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భావజాలాన్ని విస్తరించేందుకు కృషి చేశారని నరేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విద్యారంగంలో సేవలందిస్తున్నారని తెలిపారు.విద్యారంగం, యువజన రాజకీయాలు, సామాజిక ఉద్యమాలు, కాంగ్రెస్ పార్టీ కోసం డా. లింగం యాదవ్ చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని గోలి నరేష్ రజక కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి