Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘట్కాలో రామన్నపేట విద్యార్థుల జోరు. జాతీయ సెలక్షన్‌కు నవ్య, నందిని నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 04, 2026 07:34 PM

అద్దె యూనియన్ల మాయలో పడొద్దు..

అద్దె యూనియన్ల మాయలో పడొద్దు..

అద్దె యూనియన్ల మాయలో పడొద్దు..
04-10-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఓటేయాలి..

ఆర్టీసీ కార్మికుల పక్షాన శాసనమండలిలో గళం విప్పుతా..

గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..

​నల్లగొండ : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచించి ఓటేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. 'ప్రశ్నించి పోరాడే జేఏసీ కూటమి' అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. బాబు, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డిలతో కలిసి ఆదివారం నల్లగొండ ఆర్టీసీ డిపోలో నిచ్చెన, బస్సు గుర్తుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ఆర్టీసీలో 2016 తర్వాత ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగలేదని, దాదాపు దశాబ్దం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ప్రాతినిధ్యం వహించే యూనియన్‌పై గురుతర బాధ్యత ఉంటుందన్నారు. ప్రభుత్వ సర్వీసు రూల్స్, ఆర్టీసీ నిబంధనలను సమగ్రంగా పరిశీలించి కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా హక్కులను కాపాడే సంఘాలకే మద్దతు ఇవ్వాలని సూచించారు.

​ప్రలోభాలకు లొంగవద్దు..

విలీనం అంశంపై కొందరు నాయకులు తామే 'బ్రాండ్ అంబాసిడర్లమన్నట్లు' ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గతాన్ని పరిశీలించి ఎవరు నిజంగా పోరాడారు, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారో కార్మికులే తేల్చుకోవాలన్నారు. కార్మికులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా హక్కులు, ఉద్యోగ భద్రత కోసం ఓటు వేయాలని కోరారు. శాసనమండలి వేదికగా కార్మికుల సమస్యలపై నిరంతరం గళం విప్పుతానని హామీ ఇచ్చారు.

​సమస్యలపై నిరంతర పోరాటం..

జేఏసీ నాయకులు ఎస్. బాబు, థామస్ రెడ్డి మాట్లాడుతూ.. 2019 తర్వాత యూనియన్లకు అవకాశాలు లేకపోయినా తాము కార్మికుల పక్షాన నిలబడ్డామని గుర్తుచేశారు. గేట్ మీటింగ్‌లు, నిరాహార దీక్షలు, ఛలో హైదరాబాద్, బస్ భవన్‌‌లతో పాటు అసెంబ్లీ ముట్టడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ తదితర సంఘాలతో జేఏసీగా ఏర్పడి సమ్మెకు సైతం వెళ్లామన్నారు. వేతనాలు, ఉద్యోగ భద్రత, విలీన ప్రక్రియలో హక్కుల సాధనకు జేఏసీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పల్లా దేవేందర్ రెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు లోడి శ్రవణ్ కుమార్, పబ్బు వీరస్వామి, ఈయూ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బొనగిరి నరేందర్, కూటమి నాయకులు జమాల్ గౌడ్, డీజే రావు, బాసాని వెంకటయ్య, కే దయాకర్, ఎస్.కే గులాం రసూల్, ఎల్ స్వామి, ఎన్ఆర్సీ రాజు, లూర్దమ్మ, బి. శంకరమ్మ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎం.డీ జానీ, డి. వెంకన్న, వి. లెనిన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అద్దె యూనియన్ల మాయలో పడొద్దు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News