Sthanikam - Truth Matters
Logo

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేత దైద రవీందర్

Updated : 11 Mar 2026 09:18 IST
As Preferred Source 1 min read
ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేత దైద రవీందర్

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న మసీద్‌లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.

రంజాన్ మాసం శాంతి, సౌహార్దతలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, ఎండి. యూసుఫ్, యూసఫ్ వలీ, అఫ్రోజ్, అసిఫ్, బాబా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నేత దైద రవీందర్

Article Image

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న మసీద్‌లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.

రంజాన్ మాసం శాంతి, సౌహార్దతలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, ఎండి. యూసుఫ్, యూసఫ్ వలీ, అఫ్రోజ్, అసిఫ్, బాబా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి