Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:50 AM

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సంఘటిత పోరాటాలకు సంకేతం

08-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి

నల్గొండ,

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం కేవలం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు కాదని, కార్మిక మహిళల హక్కుల కోసం సాగిన పోరాటాల చరిత్రను గుర్తు చేసే రోజు అని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. మహిళలపై జరుగుతున్న శ్రమ దోపిడికి వ్యతిరేకంగా, సమాన హక్కులు మరియు రాజకీయ హక్కుల సాధన కోసం మహిళలు వీధుల్లోకి వచ్చి పోరాడిన త్యాగాలను స్మరించుకునే రోజు ఇదని తెలిపారు.

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వ్యకస, యూటీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండలోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు తుమ్మల పద్మ, కుంచెం కావ్య, శ్రీవాణి అధ్యక్షత వహించారు.

సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న ఫాసిస్టు ధోరణుల నేపథ్యంలో మహిళా ఉద్యమాలు మరింత బలంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ పేద మహిళల జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం క్రమంగా నీరుగారుస్తూ మహిళల జీవనాధారాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.

దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో మహిళా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మహిళలు ఐక్యంగా పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్‌తో పాటు సంఘాల నాయకులు జిట్టా సరోజ, కొండ అనురాధ, గుండాల నరేష్, కిరణ్, అవుట రవీందర్, భూలక్ష్మి, చెనబోయిన నాగమణి, సుల్తానా, గోలి వెంకటమ్మ, బహిరోజు ఇందిరా, మంజుల, పుష్ప, స్పందన, కీర్తన, షాలిని, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సంఘటిత పోరాటాలకు సంకేతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News