Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు అందించాలి. మాయ కృష్ణ

15-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి టౌన్, భువనగిరి పట్టణంలోని 14వ వార్డు హుస్నాబాద్ ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ ట్యాంకు ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ కాలనీ నిర్మాణం జరిగి సుమారు 15 సంవత్సరాలు పూర్తవుతున్నా, మౌలిక సదుపాయాల లేమితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద నిర్మించిన నీటి ట్యాంకు ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితమే పూర్తయినా, ఇప్పటివరకు కృష్ణా నీటిని అందులో నింపకపోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రస్తుతం కాలనీలో రోజుకొకసారి కూడా సరిపడా నీరు అందడం లేదని, ఒకటి రెండు డ్రమ్ముల నీటితోనే ప్రజలు సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, పార్కు, పాఠశాలలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక నిధులతో కాలనీ అభివృద్ధి పనులు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. తక్షణమే ట్యాంకులో నీరు నింపి, నల్లాల ద్వారా ప్రతి ఇంటికి సరఫరా చేయాలని మాయ కృష్ణ కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, వోల్దాస్ అంజయ్య, కాలనీ శాఖ కార్యదర్శి అప్పల రాములు, పల్లెపాటి జయమ్మ, గంగారపు సుదర్శన్, ఊదరి ఎల్లయ్య, జిన్నా నరసింహ, వోల్దాస్ కవిత, వల్దాస్ ఇందిరా తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రమ్మ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు అందించాలి. మాయ కృష్ణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News