Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:38 AM

హెల్త్ వీక్‌లో ఘనంగా ఆయుష్ దినోత్సవం – మెగా వైద్య శిబిరం

10-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో హెల్త్ వీక్ డే–5 సందర్భంగా ఆయుష్ & హోమియోపతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హోమియోపతి వైద్యశాస్త్ర పితామహుడు డా. సి.ఎఫ్. శామ్యూల్ హానిమన్ 271వ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు.

డా. ఎం. మనోహర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన కలెక్టరేట్ ప్రాంగణంలో ఉదయం 6:30 నుంచి 7:30 వరకు యోగా కార్యక్రమం నిర్వహించగా, సుమారు 70 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యోగా ట్రైనర్లు రామకృష్ణ, ఝాన్సీ, సరిత శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా డా. మనోహర్ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, నిత్య యోగాభ్యాసం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు.

అనంతరం హోమియోపతి, ఆయుర్వేద, యునాని విధానాలతో మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని డా. మనోహర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైద్య శిబిరంలో డా. జె.ఆర్. సంగీత (CMO), డా. కె. బాల భవాని (SMO), డా. కె. సద్గుణ, డా. వి. విజయలక్ష్మి, డా. చి. శ్రీనివాస్, డా. పి. కవిత, డా. రోజ్ మేరీ తదితరులు సేవలు అందించారు.

ఈ సందర్భంగా ఆయుష్ వైద్య విధానాల ప్రాముఖ్యతను వివరిస్తూ, సహజసిద్ధమైన చికిత్సలతో వ్యాధి నివారణతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని డా. మనోహర్ తెలిపారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో హోమియోపతి 82, ఆయుర్వేద 40, యునాని 60 మంది రోగులు చికిత్స పొందగా, మొత్తం 182 మంది లబ్ధి పొందారు.

ఈ కార్యక్రమంలో డా. పాండు నాయక్ సూపరింటెండెంట్‌తో పాటు వైద్యులు, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

హెల్త్ వీక్‌లో ఘనంగా ఆయుష్ దినోత్సవం – మెగా వైద్య శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News