Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:37 AM

హెల్త్ వీక్–డే 3: సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

08-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా “సేఫ్ మదర్ హుడ్ – కేర్ ఫర్ మదర్, హెల్త్ ఫర్ ఎవ్రీ డే” అనే థీమ్‌తో హెల్త్ వీక్–డే 3 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సూపర్‌వైజరీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ANMs, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 108 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా ANC (గర్భిణీ పరీక్షలు), హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణ, పోషణ–అనీమియా నివారణ, HBNC (హోమ్ బేస్డ్ నియోనేటల్ కేర్), కుటుంబ నియంత్రణ, సంకల్ప్ ప్రోటోకాల్, మాతృ మరణాల సమీక్ష, PC-PNDT చట్టం అమలు వంటి అంశాలపై నిపుణులు ప్రత్యేక సెషన్లు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. మనోహర్, ప్రోగ్రాం అధికారి డా. యశోద, DCHS డా. చిన్న నాయక్, గైనకాలజీ హెచ్‌వోడి డా. ఇందిర మణి, పీడియాట్రిక్ హెచ్‌వోడి డా. నిర్మల, గైనకాలజిస్టులు డా. జ్యోతి, డా. స్వప్న రాథోడ్, డా. శ్వేతా ప్రియాంక, డా. స్వరాజ్య లక్ష్మి తదితరులు పాల్గొని శిక్షణ అందించారు.

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీకి సురక్షిత ప్రసవం జరిగేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ట్యాగ్ చేసిన ఆసుపత్రులతో అనుసంధానం చేసి సమయానుకూలంగా వైద్య సేవలు అందించాలన్నారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, శిశువులకు నాణ్యమైన సేవలు అందించేందుకు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వైద్యులు, ANMs, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హెల్త్ వీక్–డే 3: సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News