Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

హయత్‌నగర్‌లో పూలే జయంతి – మహిళా విద్యకు పునాది వేసిన మహనీయుడు

11-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా హయత్‌నగర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బీసీ హాస్టల్‌లో కూడా జయంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పూలే గొప్ప సంఘసంస్కర్తగా సమాజ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి బాలికల పాఠశాలలు స్థాపించడం ద్వారా మహిళా విద్యకు పునాది వేశారని తెలిపారు.

సత్యశోధక్ సమాజ్ స్థాపనతో సమానత్వం కోసం పోరాడిన మహనీయుడిగా పూలేను కొనియాడారు. ప్రతి బీసీ హాస్టల్, గురుకుల పాఠశాలల్లో ఆయన పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఆయన పేరును విశ్వవిద్యాలయానికి పెట్టాలని కోరారు.

డా. మక్ల మాట్లాడుతూ పూలే గొప్ప తత్వవేత్త, రచయిత అని, ఆయన రచించిన ‘గులాం గిరీ’ సమాజానికి మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్ర, హాస్టల్ సంక్షేమ అధికారి, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

హయత్‌నగర్‌లో పూలే జయంతి – మహిళా విద్యకు పునాది వేసిన మహనీయుడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News