Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:34 AM

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

01-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాలీబాల్ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభమైంది. శారీరక విద్యా విభాగం ఆధ్వర్యంలో స్థానిక బాలబాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం కళాశాల ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టినదని నిర్వాహకులు తెలిపారు. 12 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో శారీరక దృఢత్వం పెంపొందించడం, క్రీడలపై ఆసక్తి కలిగించడం లక్ష్యంగా శిక్షణ అందిస్తున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు అధ్యక్షతన, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె. అనిత మార్గదర్శకత్వంలో ప్రారంభ కార్యక్రమం జరిగింది.

ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల వరకు కళాశాల మైదానంలో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.

శిబిరం ద్వారా పాల్గొనే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతను ప్రోత్సహించి భవిష్యత్ అవకాశాల వైపు దారి చూపించనున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమానికి మధు, బాలనరసింహ, శేఖర్, నాగేంద్ర, అపర్ణ చతుర్వేది, రమాదేవి, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

ఈ శిబిరానికి స్థానికంగా మంచి స్పందన లభిస్తున్నదని ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత తెలిపారు.

Sthanikam

హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News