Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వ్యక్తిగత భూముల కోసం ప్రభుత్వ భూమిలో రోడ్డు.. చర్యలు తీసుకోవాలి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:23 PM

హరిత ఇంధనంపై జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ

09-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న హరిత ఇంధన వనరులు, పర్యావరణ పరిరక్షణపై రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. అంజిరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సదస్సు కన్వీనర్ డా. అంతటి శ్రీనివాస్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో హరిత ఇంధన వనరులు కీలకమని అన్నారు. శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి సౌర, పవన శక్తిని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హరిత ఇంధన వినియోగంతో గాలి, నీరు, నేల కాలుష్యం తగ్గి పర్యావరణం స్వచ్ఛంగా మారుతుందని, ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు.

ప్రభుత్వం సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించే జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల ఆచార్యులు, కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు హాజరుకానున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. పరంగి రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బత్తిని నాగరాజు, అధ్యాపకులు డా. అనిల్ అబ్రహం, డా. అనిల్ బొజ్జ, డా. బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హరిత ఇంధనంపై జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News