Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:41 AM

గోరంట్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం – బూదిలి పాఠశాలలో రూ.40 లక్షల పనులకు భూమిపూజ

26-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

గోరంట్ల,

శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు గుత్తా బాలక్రిష్ణ చౌదరి ఆధ్వర్యంలో బూదిలి హైస్కూల్‌లో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో కాంపౌండ్ వాల్, రెండు తరగతి గదులు, బోర్‌వెల్ మరియు సంపు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం జలధార-నీటి నిర్వహణ కార్యక్రమంలో భాగంగా బూదిలి తండా సమీపంలోని రెడ్డి కుంట వంక వద్ద నీటి సంరక్షణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో హస్తకళల రాష్ట్ర డైరెక్టర్ సోమశేఖర్, టిడిపి జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, నాయకులు చంద్ర, మాజీ సర్పంచులు నాగే నాయక్, ఉత్తమ్ రెడ్డి, నీడిమామిడప్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే 5 మ్యాన్ కమిటీ సభ్యులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, జనసేన ప్రతినిధులు, స్కూల్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ అభివృద్ధి పనులు పూర్తి కావడంతో ప్రాంతీయ ప్రజలకు, విద్యార్థులకు మరింత సౌకర్యాలు కలుగనున్నాయని నాయకులు తెలిపారు.

Sthanikam

గోరంట్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం – బూదిలి పాఠశాలలో రూ.40 లక్షల పనులకు భూమిపూజ

Article Image

గోరంట్ల,

శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు గుత్తా బాలక్రిష్ణ చౌదరి ఆధ్వర్యంలో బూదిలి హైస్కూల్‌లో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో కాంపౌండ్ వాల్, రెండు తరగతి గదులు, బోర్‌వెల్ మరియు సంపు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం జలధార-నీటి నిర్వహణ కార్యక్రమంలో భాగంగా బూదిలి తండా సమీపంలోని రెడ్డి కుంట వంక వద్ద నీటి సంరక్షణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో హస్తకళల రాష్ట్ర డైరెక్టర్ సోమశేఖర్, టిడిపి జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, నాయకులు చంద్ర, మాజీ సర్పంచులు నాగే నాయక్, ఉత్తమ్ రెడ్డి, నీడిమామిడప్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే 5 మ్యాన్ కమిటీ సభ్యులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, జనసేన ప్రతినిధులు, స్కూల్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ అభివృద్ధి పనులు పూర్తి కావడంతో ప్రాంతీయ ప్రజలకు, విద్యార్థులకు మరింత సౌకర్యాలు కలుగనున్నాయని నాయకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News