Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:33 AM

గంజాయితో ఐదుగురు అరెస్ట్

గంజాయితో ఐదుగురు అరెస్ట్

గంజాయితో ఐదుగురు అరెస్ట్
01-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదాపూర్ గ్రామ శివారులో గంజాయితో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్లమ్మ గుడి సమీపంలో తనిఖీలు నిర్వహించిన తుర్కపల్లి ఎస్సై, సిబ్బందితో కలిసి అనుమానితులను పట్టుకున్నారు.

వారి వద్ద సుమారు 200 గ్రాముల గంజాయి లభ్యమైందని పోలీసులు తెలిపారు. విచారణలో వారు గంజాయిని కలకత్తా నుంచి కొనుగోలు చేసి మాదాపూర్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

నిందితుల వివరాలు

ఒగ్గు బాబు, జూకంటి సత్యం, ఒగ్గు నవీన్ కుమార్, జూకంటి శివకుమార్ (మాదాపూర్ గ్రామం), ధీరావత్ దేవేందర్ (వాలు తండ, బొమ్మలరామారం మండలం)గా గుర్తించారు.

స్వాధీనం చేసిన వస్తువులు

200 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గంజాయి వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ కేసు యాదాద్రి భువనగిరి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఐపీఎస్, డీఎస్పీ పి. శ్రీనివాస్ నాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. శంకర్ పర్యవేక్షణలో తుర్కపల్లి ఎస్సై మహమ్మద్ తఖియుద్దీన్ మరియు సిబ్బంది చర్యలు చేపట్టారు.

Sthanikam

గంజాయితో ఐదుగురు అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News